Friday, May 25, 2007

నవ్వితే నవ్వండి.....

జోక్:-
ఒకానొకప్పుడు బీహార్ లో ఒక తెలివైన వ్యక్తి టోపీలు అమ్ముకుని జీవించేవాడు.ఒక వేసవి కాలంలో ఒక దట్టమైన అడవి గుండా వెళ్తున్నాడు, బాగ అలసిపోయి చెట్టుకింద పడుకుని నిద్ర పోయాడు, అప్పుడొక కోతి వచ్చి ఒక టోపి ఎత్తుకుని పోయింది. అది చూసి వాడు అలోచించి తల గోక్కున్నాడు, కోతి కూడా అలాగే చెసింది. ఆది చూసి వాడికి ఒక ఆలోచన వచ్చి వాడి టోపి కింద పడేశాడు, కోతి కూడా టోపి కింద పడేసింది, అది తేసుకుని వాడు చక్కా పోయాడు.
ఇది అందరికి తెలిసిందే....
కొన్నేళ్ళకి వాడి మనవడు లాలు ప్రసాద్ యాదవ్ కూడా టోపీల వ్యాపారం మొదలుపెట్టాడు.లాలు కూడా వేసవి కాలంలో అదే అడవి గుండా వెళ్తూ చెట్టు కింద పడుకున్నాడు,కోతి వచ్చి టోపి ఎత్తుకునిపోయింది. లేచి చూసుకున్న లాలు కి వాళ్ళ తాత చెప్పిన కథ గుర్తు వచ్చి వాడు కూడా అలాగే తల గోక్కున్నాడు. కోతి కూడ గోక్కుంది. అప్పుడు వాడు తన టోపి తీసి కింద పడేసాడు. అప్పుడు వేరొక కోతి చటుక్కున వచ్చి ఆ టోపొ అందుకుని వాడి చెంప మీద ఒక్కటి ఇచ్చి, నీకు ఒక్కడికే తాత ఉన్నాడనుకున్నావా.... అంది.

నవ్వితే నవ్వండి.....

Thursday, May 24, 2007

ఆరంభశూరత్వమేనా????

అదేమిటోకానీ...నేను అన్ని మొదలుపెడతాను, కాని సరిగా చివరివరకు చెయ్యను, ఇది కూడా ఆరంభశూరత్వమేనా???? ఏమో ఇంకా తెలియదు...చూద్దాం...

budugu vachesadu....

అల్లరి చెయ్యదానికి బుడుగు వచ్చేశాడు.....జాటర్ ఢమాల్...కాసుకోండి....