మా అమ్మమ్మ కి చచ్చేంత సినిమా పిచ్చి.
ఒకసారి మమ్మల్ని చూసివెళ్దామని మా ఊరు వచ్చంది.
అప్పుట్లో మా ఊళ్ళోని (పశ్చిమగోదావరి జిల్లా, ధర్మాజీగూడెం) వెంకటేశ్వర హాల్ లో జగపతిబాబు గాయం సినిమా ఉంది.
అప్పుడు నేను 8వ తరగతి చదువుతున్నట్టుగా ఉన్నాను.
మా అమ్మమ్మకేమో సినిమా చూడాలని ఉంది.
మా పిల్లలం ఎవరిని అడిగినా రాము అన్నారు.
తను ఒక్కతే వెళ్ళిపోయింది.
మ్యాట్నీ చూసి వచ్చిన అమ్మమ్మని సినిమా ఎలా ఉంది అమ్మమ్మా? అని అడిగితే చెప్పింది,
"ఈరోకి ఒక అన్న ఉంటాడు, ఆణ్ణి ఇలన్ సంపేత్తాడు, ఈరో కొన్నళ్ళయ్యాక ఇలన్ని సంపేత్తాడు, అప్పుడు జరిగె గలాటా లో ఈరో కి గాయవయ్యిద్ది, అదే గాయం" అని చెప్పింది.
అది విని మా ఇంట్లో అందరు ఒకటే నవ్వు.
మొన్న ఒక రోజు టివి లో గాయం సినిమా చూస్తుంటే ఇది గుర్తుకు వచ్చింది.
రాంగోపాల్ వర్మ సినిమా ముసలి వాళ్ళు చూస్తే ఇలాగే ఉంటుందేమో అనిపించింది.
Wednesday, July 25, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
గాయం స్టోరీ బావుంది :-)
-- విహారి
LOL. Nice story!!
Post a Comment