Tuesday, October 23, 2007

ప్రేమ వివాహం తప్పా?

ఇవ్వాళ సినీ నటుడు ప్రభాస్ వ్యాఖ్యానించాడు "ప్రేమ వివాహం లో తప్పేం ఉంది అని?". నిజం గా ఇందులో తప్పేమి లేదా? వివాహం అంటే ఇద్దరు మనుషుల మధ్య బంధమేనా? రెండు కుటుంబాల మధ్య బంధం కాదా?
ఇరు వైపులా రెండు కుటుంబాలు ఒప్పుకుని చేస్తే దానిలో తప్పేమీ లేదు.
మరి ఒక కుటుంబం ఒప్పుకుని ఒక కుటుంబం ఒప్పుకోకుండా చేసుకుంటే? ఆ ఒప్పుకోని కుటుంబానికి చెందిన వాళ్ళు తన కుటుంబానికి దూరం కావలిసిందే కదా? తల్లిదండ్రులు ఇంతకుముందులాగా మూర్ఖంగా అంతస్తులు, కులాలు అని చెప్పి అభ్యంతరం చెప్పట్లేదు. మొదట్లో వద్దు అన్నా కాని తరువాత వాళ్ళ ప్రేమని అర్దం చేసుకుని వాళ్ళే ఒప్పుకుంటున్నారు.
ఆ ప్రేమికులకు నిజంగా మానసిక పరిపక్వత వచ్చి వాళ్ళకు కావలసిన వాళ్ళను ఎంచుకుంటే పెద్దవాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు, కాని తెలిసీ తెలియని వయసులో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం నాశనం చేసుకుంటము అంటే ఎవ్వరు ఒప్పుకోరు.18 సంవత్సరాల వయసుకి వాళ్ళకి ఏమి కావాలో తెలుసుకునే అనుభవం వాళ్ళకు ఉంటుందా?
రేపు సమాజం లో అన్ని సవాళ్ళని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కోగలరా? "అనుభవం అయితే కాని తత్వం బోధపడదు" అన్నట్లుగా కళ్ళకు కమ్మిన అందమైన పొర కరిగిపోగానే వాళ్ళు చేసిన తప్పు తెలిసి వస్తుంది, రోజు మీడియా లో, మన చుట్టుప్రక్కల ఎన్ని చూడడం లేదు.
పరిపక్వతతో కూడిన ప్రేమ, ప్రేమ వివాహం అద్భుతంగా ఉంటుంది. లేకుంటే చేసిన దాని గురించే తలుచుకుని భాధ పడేంత పరమ దుర్భరం గా జీవితం ఉంటుంది.
ఈ టపా ఎందుకు రాసానో నాకు తెలియదు, నాలో ఉన్న ఆలోచనలన్నీ అలా రాసేసాను, ఏదయిన తప్పుగా వ్యాఖ్యానించి ఉంటె క్షంతవ్యుడిని.

2 comments:

వింజమూరి విజయకుమార్ said...

మీరన్నట్టు పరిపక్వత చెందిన ప్రేమ వివాహం తప్పుకాదు. కానీ, 18 యేళ్ళ వయసులో బలీయమైన ఆకర్షణే వుంటుంది. నాకయితే చిరంజీవి కుమార్తెది సజావుగా అన్పించడం లేదు. ఇందర్ని బాధకి గురి చేసి, ఆ మోజు కాస్త తీరాక పశ్చాత్తాపం తప్పేట్టులేదు శ్రీజకి. గమనికః నేను చిరంజీవి అభిమానిని కాదు. అందరి సినిమాలూ చూస్తా.

Unknown said...

antastulu, astulu erojullo kuda chustunnarandi...udaharanaku naa na kadhe....nenu e madhye prema vivaham chesukunnanu....eruvaipula evaru oppukoledu, endukante kulalu veru, antastulu veru, peddalanu kadani memu pelli chesukunnamu, eppudu happyga untunnamu,