కాంగ్రేస్ పార్టీ(దాని మిత్ర పక్షాలు): -
అయితే ఏమిటి? అప్పుడెప్పుడో అయోధ్యలో ఏదో జరిగింది, దాని ప్రభావమే ఇవన్నీ...సమాజంలో ఒక్క వర్గాన్నే పోలీసులు లక్ష్యం చేసుకుంటున్నారు.
భా.జ.పా (దాని మిత్ర పక్షాలు): -
అయితే ఏమిటి? పోటా రద్దు ఫలితమే ఇవన్నీ, మా పాలన అద్భుతం, కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఇవన్నీ.
అధికారులు: -
అయితే ఏమిటి? ప్రాజెక్ట్‌లలో మనకు రావలసిన పెర్సెంటేజ్ మనకి వస్తుంది కదా?
రాజకీయనాయకులు: -
అయితే ఏమిటి? మనకు రావలసిన అల్ప సంఖ్యాక వర్గాల వోట్లు మనకే వస్తున్నాయి కదా?
పోలీసులు: -
అయితే ఏమిటి? పంచాయితీలలో, సెటిల్‌మెంట్‌లలో మనకి బాగానే డబ్బులు వస్తున్నాయి కదా?
ప్రజలు:
అయితే ఏమిటి? అది అది వాళ్ళ ఖర్మ, ప్రభుత్వం ఎంత మంచిదో... మాకు రెండు రూపాయలకి బియ్యం, ఉచితంగా విద్యుత్తు, రంగు టి.విలు ఇస్తుంది కదా?
Monday, July 28, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
అలతి పదాలలో అనల్పమైన అర్థాన్ని ఇమిడ్చారు. అభినందనలు. మొదటిసారి చదివితే నవ్వొచ్చింది. రెండోసారి చదివితే బాధేసింది.
Post a Comment