హైదరాబాద్ తిరిగివచ్చిన మూడు సంవత్సరాల తరవాత నాకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి వెళ్ళడం కుదిరింది. ఈరోజు నేను 27 వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శన కి వెళ్ళాను. కొన్ని కొనాలనుకున్న పుస్తకాలు కొనలేకపోయాను, కొన్ని అనుకోకుండా కొన్నాను. కాని అక్కడికి వచ్చిన పుస్తక ప్రియులందరినీ చూశాక మాత్రం తెలుగు పుస్తకం ఇంకా సజీవంగా మాత్రమే కాదు, చాలా ఆరోగ్యంగా ఉంది అనిపించింది. సుమారుగా 100 వరకు స్టాళ్ళు పెట్టారు, కాకపోతే సాహిత్యం కన్నా సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలకే గిరాకీ ఎక్కువ ఉన్నట్టు అనిపించింది.
e-తెలుగు, కినిగె, సురవర స్టాళ్ళ వద్ద జనం ఆసక్తి గా విషయ సేకరణ చేశారు, నేను ఉన్న మూడు గంటల్లో 5/6 సురవర కీబోర్డ్ లు తీసుకున్న వాళ్ళు కనిపించారు, its good to see. దర్గామిట్ట కథలు నాకు దొరకలేదు. కాని అనుకోకుండా ప్రళయకావేరి కథలు పుస్తకం దొరికింది, 4/5 సంవత్సరాల క్రితం తెలుగుపీపుల్.కామ్ లో ఈ పుస్తకం చదివాను, ఇన్నాళ్ళకి కొన్నాను.
నేను కొన్న పుస్తకాలు.
1. ప్రళయకావేరి కథ లు.
2. అగ్రహారం కథలు.
3. అసలేం జరిగిందంటే
4. నాహం కర్తాహ్ హరి:కర్తాహ్
5. సాయంకాలం అయింది
6. గోనగన్నారెడ్డి
7. రాజశేఖర చరిత్రం
8. దాశరధి శతకం
నా గ్రంధాలయం పెరిగి పెద్దదవుతుంది...

2 comments:
సంతోషం
మీ బ్లాగు పేరు బావుందండి.
Post a Comment