విశాఖపట్నంలో చదువుకునే రోజుల్లో రాజమండ్రి నుంచి వచ్చిన శీనుగాడు, సూర్రెడ్డి ఒక రూములో ఉండేవారు. ఆప్పుడప్పుడూ నేను వాళ్ళ రూముకి వెళ్ళేవాడిని. ఇక్కడ వీళ్ళ గురించి కొంచెం చెప్పాలి. శీనుగాడికి ఏ విషయం అయినా వాదించడం అంటే ఇష్టం.సూర్రెడ్డికేమో ఏదీ తెగేదాకా లాగటం ఇష్టం ఉండదు. మేము ఏదయినా టెక్నికల్ విషయాలు, సబ్జెక్ట్, రాజకీయాలు ఏవయినా కానీ చాలా ఉత్సాహంగా మాట్లాడుకునేవాళ్ళం. శీనుగాడేమో ఏ విషయమైనా సరదాకి వాదన మొదలెట్టేవాడు, ఆ వెంటనే సూర్రెడ్డి "వాదనల వల్ల అభిప్రాయాలు మారవు..." అనేసి అక్కడ నుంచి వెళ్ళిపొయేవాడు.
అప్పట్లో నాకు అర్దం కాలేదు కానీ, చెన్నపట్నం వచ్చాక ఆ డైలాగ్ అనుభవం ద్వారా అర్దం అయింది. ఇక్కడ మన టీంమేట్స్ తమిళ వాళ్ళు ఉంటే వాళ్ళతో ఏ విషయం కూడా వాదించ కూడదు, వాళ్ళ అభిప్రాయాలు ఎప్పటికీ మారవు, తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళు అని వాదిస్తారు, వెంటనే సూర్రెడ్డిని తను అప్పట్లో చెప్పిన డైలాగ్ గుర్తు చేసుకుని వాళ్ళతో వాదన చెయ్యడం ఆపేస్తాను, లేకపోతే "రామాయణం ముందు తమిళంలో రాస్తే వాల్మీకి దాన్ని కాపీ కొట్టాడు...." అంటే మనమేం చెయ్యగలం....
Saturday, February 23, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
:)
:))
ఇంటర్లో వున్నప్పుడు నేనూ విపరీతంగా వాదించేవాణ్ణి (అంటే ఇప్పుడు నేను ఉత్తమపురుషుణ్ణైపోయానని కాదు). వాదనలో గెలిచిన ప్రతిసారీ నువ్వొక మిత్రుణ్ణి కోల్పోతావనే సూక్తి వుంది. ఆ సూక్తి చిన్నప్పటినుంచే తెలిసినా, దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టేటప్పటికి నా వయసెంతుంటుందో చెప్పడం కష్టం.
Post a Comment